schedule Sunday, July 05, 2026

లారీ-బైకు ఢీ

calendar_today February 12, 2024
person dharshininews
లారీ-బైకు ఢీ
లారీ-బైకు ఢీ - వ్యక్తికి గాయాలు, కేసు నమోదు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: లారీ - బైకు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం తాండూరు కరణ్ కోట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం చించొల్లి తాలూకా చౌడాపూర్ గ్రామానికి చెందిన బస్వరాజ్ కలశెట్టి అనే వ్యక్తి తన బైకు (కేఏ 32 ఈడబ్ల్యూ 1288) తాండూరుకు వస్తున్నాడు. మార్గ మద్యలోని కోటబాస్పల్లి కేరళ మాడల్ హైస్కూల్ దగ్గరు రాగానే అదే మార్గంలో ముందు వెళుతున్న లారీ (కేఏ 39 ఏ 1877) డ్రైవర్ నిర్లక్ష్యంగా సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక ఉన్న బస్వరాజ్ లారీని బైకుతో పాటు ఢీకొట్టాడు. ఈ క్రమంలో బస్వరాజ్ కు రక్తగాయాలు అయ్యాయి. జరిగిన సంఘటనపై బాధితుడు కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23803/