schedule Sunday, July 05, 2026

సత్ప్రవర్తనతో మెలగాలి

calendar_today February 11, 2024
person dharshininews
సత్ప్రవర్తనతో మెలగాలి
సత్ప్రవర్తనతో మెలగాలి - రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా -  కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : సమాజంలో అందరు సత్ప్రవర్తనతో మెలగాలని తాండూరు సబ్ డివిజన్ కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి సూచించారు. ఆదివారం కరణ్ కోట్ పోలీస్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లతో ఎస్ఐ విఠల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. వాళ్లతో మాట్లాడి ప్రస్తుత జీవన శైలి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీ షీటర్లుగా పేరు మోపబడిన వారు సమాజంలో సత్ప్రవర్తనతో ఉండాలన్నారు. గతాన్ని పూర్తిగా మరిచిపోవాలని, అందరి పట్ల స్నేహ పూర్వకంగా ఉండాలన్నారు. అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మీ అందరిపై పోలీసుల నిఘా ఉంటుందని, శాంతి భద్రత విషయంలో పోలీసులకు సహాకారం అందించాలన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23778/