schedule Saturday, September 05, 2026

వాహనదారులకు మళ్లీ చాన్స్‌..!

calendar_today January 31, 2024
person dharshininews
వాహనదారులకు మళ్లీ చాన్స్‌..!
వాహనదారులకు మళ్లీ చాన్స్‌..! - ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పెంపు - మళ్లీ పొడగించేది లేదని సూచన హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ట్రాఫిక్ చలాన్లను చెల్లించలేని వాహనదారులకు ప్రభుత్వం మరోచాన్స్ అందించింది. జనవరి 31వరకు ట్రాఫిక్‌ చలాన్ల రాయితి చెల్లింపుకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సర్కారు ఈ గడువును పెంచుతున్నట్లు వాహనదారుల గుడ్‌ న్యూస్ చెప్పింది. మరో 15 రోజుల పాటు పెండింగ్ చలాన్ల చెల్లింపుల గడువు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులు తమ పెండింగ్ చలాన్లను ఆన్లైన్లో చెల్లించునేందుకు అవకాశం కల్పించింది. ఆర్టీసీ బస్సులకు 90శాతం, ద్విచక్ర వాహనాలు, కార్లకు 80శాతం, భారీ వాహనాలకు 60శాతం రాయితీతో చెల్లించవచ్చు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్య కార్యదర్శి శాంతికుమారి పోలీసు శాఖకు, రోడ్డు రవాణా శాఖ ఉన్నతాధికారులకు జారీ చేశారు. మొదటి రోజు నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున వాహనదారులు చలాన్లు కట్టటంతో.. సర్వర్ హ్యాంగ్ అయ్యింది. దీంతో.. చాలా మంది వాహనదారులు చలాన్లు కట్టలేకపోయారు. దీంతో ఈ రాయితీకి ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదికూడా చదవండి.. https://dharshininews.com/23566/