schedule Sunday, July 05, 2026

రన్నింగ్ రైలెక్కుతుండగా..!

calendar_today January 30, 2024
person dharshininews
రన్నింగ్ రైలెక్కుతుండగా..!
రన్నింగ్ రైలెక్కుతుండగా..! - కిందపడిన ప్రయాణికుడు - ప్లాట్ ఫాం నుంచి లాక్కెల్లిన రైలు - కట్ట పగుల గొట్టి కాపాడిన స్థానికులు - వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఘటన వికారాబాద్, దర్శిని ప్రతినిధి: అతనికి ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయేమో.. చావు దాకా వెళ్లాడు. కదులుతున్న రైలు ఎక్కబోయి ప్లాట్ ఫాం రైలు మధ్య ఇరుక్కు పోయాడు. రైలు అలాగే లాక్కెళ్లి పోయింది. తల్లడిల్లిన ప్రయాణికున్ని స్థానికులు అప్రమత్తమై రక్షించారు. ప్లాట్‌ ఫాంను బద్దలు కొట్టి రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి రైల్వే స్టేసన్‌లో యశ్వంత్ పూర్ రైలు చేరుకుని కదులుతోంది. అంతలోనే ఓ ప్రయాణికుడు పరుగెత్తుకుంటూ వచ్చి కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. కదులుతున్న రైలు, ప్లాట్‌ ఫాం మద్య ఇరుక్కున్న అతను నరకయాతను అనుభవించాడు. రైలు అలాగే అతన్కి కొద్ది దూరం లాక్కెంది. గమనించిన స్థానికులు రైలును ఆపేశారు. ఫ్లాట్‌ ఫాం మద్య ఇరుక్కున్న బాధితున్ని ఫ్లాట్ ఫాం కట్టను బద్దలు కొట్టి బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో గాయపడిన వ్యక్తిని రాయచూర్‌కు చెందిన సతీష్‌గా గుర్తించారు. వీడియో కింద లింకులో చూడండి... https://youtu.be/LfhnWEJxWJ8 ఇదికూడా చదవండి.. https://dharshininews.com/23524/