రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
January 29, 2024
dharshininews
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- ఫిబ్రవరి 27న పోలింగ్ ఖరారు
- నామినేషన్లు, ఫలితాలు ఎప్పుడంటే..?
దర్శిని డెస్క్ : కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఎన్నికల షెడ్యూల్‌లో 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు.. తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం వచ్చే ఏప్రిల్ నెలలో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాఆ రాజ్యసభ సభ్యుల నియామకం కోసం సమాయత్తం అయ్యింది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఫిబ్రవరి 15 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఫిబ్రవరి 16న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు ఫిబ్రవరి 20 వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించగా.. అదే రోజున సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడవుతాయి.
రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. అయితే ఏపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్.. తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్‌లు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరి పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది.
ఇదికూడా చదవండి...
https://dharshininews.com/23507/