schedule Saturday, September 05, 2026

ఔషధ ఖర్జూరం..!

calendar_today January 27, 2024
person dharshininews
ఔషధ ఖర్జూరం..!
ఔషధ ఖర్జూరం..! - నెయ్యిలో నానబెట్టి తింటే మంచి ప్రయోజనం - శరీరంలో కోలస్ట్రాల్‌ తగ్గాలంటే ఇది ట్రై చేయండి దర్శిని డెస్క్‌: ఔషధ గుణాలు కలిగిన ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనిషి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో ఎంతగానో సహాయ పడుతుంది. ఖర్జూరంలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఏ, సి లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచి శరీర సమతుల్యతను కాపాడుతుంది. మరీ ముఖ్యంగా ఖర్జూరంను ఉదయం పడగడుపున తీసుకుంటే మరిన్ని లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఖర్జూరాన్ని నెయ్యిలో నానబెట్టి తీసుకుంటే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. - ఖర్జూరం, నెయ్యి కలిపి తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఖర్జూరాల్లో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగుల కదలికలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మరోవైపు, నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది గట్ బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుతాయి. నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. - ఖర్జూరంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నెయ్యి, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీంతో ఇది శరీరాన్ని చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాన్ని తీసుకోవడం వల్ల ఇన్‌స్టంట్‌ ఎనర్జీ లభిస్తుంది. ఉదయం పడగడుపున ఖర్జూరాన్ని ఇలా తీసుకుంటే రోజంతా ఉషారుగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. - ఖర్జూరం, నెయ్యి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. ఖర్జూరంలో పుష్కలంగా ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గమనిక : పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23396/