schedule Sunday, July 05, 2026

త్వరపడండీ..!

calendar_today January 9, 2024
person dharshininews
త్వరపడండీ..!
త్వరపడండీ..! - ట్రాఫిక్ చలాన్లను చెల్లించండి - రేపే క్లియరెన్స్‌కు లాస్ట్ గడువు - తాండూరు రూరల్ సీఐ రాంబాబు తాండూరు, దర్శిని ప్రతినిధి : ట్రాఫిక్ చలాన్ల రాయితీని సద్వినియోగం చేసుకునేందుకు వాహనదారులు త్వరపడాలని తాండూరు రూరల్ సీఐ రాంబాబు సూచించారు. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుకు ప్రభుత్వం రాయితీని కల్పించిన సంగతి తెలిసిందే. టూ, త్రీ వీలర్స్ కు 80శాతం, ఆర్టీసీ బస్సులకు 90శాతం, భారీ వాహనాలకు 60శాతం రాయతీ ప్రకటించింది. ఇప్పటి వరకు పలువురు వాహనదారులు కూడా చెల్లింపు జరిపారు. మంగళవారం తాండూరు సీఐ రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన రాయితీ గడువు రేపు బుధవారంతో ముగిస్తుందని తెలిపారు. తాండూరు నియోజవర్గంలో తాఁడూరు పట్టణంతో పాటు వివిధ మండలాలలో ఇంకా చలాన్లు చెల్లించని వాహనదారులు త్వరపడాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గడువు తరువాత పోలీసులు తనిఖీలు నిర్వహించి పూర్తి మొత్తాన్ని రాబట్టుకుంటారని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23048/