schedule Sunday, September 06, 2026

మహిళలకు గుడ్‌ న్యూస్..!

calendar_today January 4, 2024
person dharshininews
మహిళలకు గుడ్‌ న్యూస్..!
మహిళలకు గుడ్‌ న్యూస్..! - రూ. 2500ల సాయానికి కసరత్తు - ఎప్పటి నుంచి అందించనుందంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు రేవంత్ సర్కారు అందిస్తున్న గుడ్‌ న్యూస్. ప్రభుత్వం మహిళలకు ప్రతి నెల రూ. 2500ల సాయం అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఎప్పటి నుంచి పంపిణీ చేయాలనే దానిపై కూడా ఓ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఆరు గ్యారెంటీల పథకాలను హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇచ్చిన రెండు గ్యారెంటీలలో ఆరోగ్య శ్రీ, మహాలక్ష్మీ కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహాలక్ష్మీ కింద మరో హామీని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆర్థక శాఖతో చర్చించినట్లు సమాచారం. వచ్చే నెలలో మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చూడాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే ప్రజా పాలన పేరుతో సంక్షేమ పథకాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సమాచారాన్నంతా డేటా ఎంట్రీ చేయిస్తున్నారు. త్వరలోనే వెరిఫికేషన్‌ పూర్తి చేసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పథకాలు అమల్లో ఉన్న వారిని పథకాల నంచి తొలగిస్తారన్న వార్తలపై సీఎం రేవంత్‌ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. పాత వారికి యథావిధిగా పథకాలు అమలు అవుతాయని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మహాలక్ష్మీ పథకం అమలుపై ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో అమలు తీరును పరిశీలిస్తోంది. దీంతో ఆ పథకాలపై అధ్యయం చేసి, ఎంత ఖర్చు అవుతుందో తెలపాలని అధికారులకు సీఎం తెలిపారని సమాచారం. ఇదికూడా చదవండి... https://dharshininews.com/22928/