schedule Friday, September 04, 2026

తెలంగాణ ఉద్యమకారులకు ఊరట

calendar_today December 8, 2023
person dharshininews
తెలంగాణ ఉద్యమకారులకు ఊరట
తెలంగాణ ఉద్యమకారులకు ఊరట - కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కారు - ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో అధికారం చేపట్టిన రేవంత్ సర్కారు తెలంగాణ ఉద్యమ కారులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకోంటోంది. తెలంగాణ ఉద్యమ సమయం అంటే 2009 నుంచి 2014 సంవత్సరం వరకు ఉద్యమకారులపై కేసులు నమోదు అయ్యాయి. వారికి పెద్ద ఊరట కలిగించేలా రేవంత్‌రెడ్డి సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ సందర్భంగా 2009 నుంచి 2014 సంవత్సరం వరకు ఉద్యమకారులకు సంబంధించిన కేసుల వివరాలను అందించాలని ఎస్పీలకు డీజీపీ ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఉద్యమకారులపై కేసులను ఎత్తివేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర పరిస్థితులపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22496/