schedule Sunday, July 05, 2026

మద్యం దుకాణాలు బంద్

calendar_today November 28, 2023
person dharshininews
మద్యం దుకాణాలు బంద్
మద్యం దుకాణాలు బంద్ - తాళం వేసిన ఎక్సెజ్ పోలీసులు - రెండు రోజులు విక్రయాలు నిషేదం - తాండూరు ఎక్సైజ్ సీఐ అనంతయ్య తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాండూరులో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మంగళవారం సాయంత్రం తాండూరు ఎక్సైజ్ సీఐ అనంతయ్య ఆధ్వర్యంలో అధికారులు పట్టణంలోని వైన్స్ షాపులకు తాళం వేశారు. అదేవిధంగా బార్లలో అమ్మకాలపై నిషేధం విధించారు. మంగళవారం సాయంత్రం 6గంటల నుంచి 30వ తేది సాయంత్రం 6గంటల మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందని సీఐ తెలిపారు. అదేవిధంగా డిసెంబర్ 3వ తేదిన జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆరోజు కూడా మద్యం దుకాణాలతో పాటు బార్లలో మద్యం అమ్మకాలను నిలిపివేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం విక్రయాలకు పాల్పడితే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22317/