schedule Sunday, July 05, 2026

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

calendar_today November 15, 2023
person dharshininews
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య - గులాబీ చున్నీతో ఘాతుకం - లభించని మృతుని వివరాలు - తాండూరు పట్టణంలో సంఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : చెట్టుకు ఉరి వేసుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రైల్వే స్టేషన్ 7వ రైల్వే ట్రాక్ ముగింపు వద్ద నెమలి చెట్టుకు సుమారు 50-55 ఏండ్లు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి గులాబీ చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వద్ద ఇలాంటి వివరాలు లభించలేదు. మృతుని ఒంటిపై చాక్లెట్ రంగు కలిగినడబ్బాల చొక్కా, నలుపు రంగు ప్యాంటు, చాక్లెట్ కలర్ బనియన్ ధరించి ఉన్నాడు. వికారాబాద్ స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని రైల్వే పోలీసుల వెల్లడించారు. మృతుని ఆచూకీ తెలిస్తేరైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.   https://dharshininews.com/21944/