schedule Sunday, July 05, 2026

తనిఖీల్లో నిర్లక్ష్యం వహించొద్దు

calendar_today November 13, 2023
person dharshininews
తనిఖీల్లో నిర్లక్ష్యం వహించొద్దు
తనిఖీల్లో నిర్లక్ష్యం వహించొద్దు - డీటీసీ ఆడిషనల్ ఎస్పీ మురళీధర్ - కొత్లాపూర్ చెక్ పోస్టు సందర్శన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద తనిఖీలలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా డీటీసీ అడిషనల్ ఎస్పీ మురళీధర్ అన్నారు. సోమవారం తాండూరు మండలం కొత్లాపూర్ చెక్ పోస్టును ఆయన సందర్శించారు. కరణ్ కోట్ పోలీసులతో కలిసి తనిఖీలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ చెక్ పోస్టు వద్ద తనిఖీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మద్యం, డబ్బులు, మత్తు పదర్థాలు, బంగారం, వెండి వస్తువులు తరలించకుండా జాగ్రత్త వహరించాలన్నారు. నిర్లక్ష్యం ప్రదర్శించకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, రెవెన్యూ, ఎక్సెజ్ శాఖల అధికారులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21866/