schedule Saturday, September 12, 2026

వ్యాపారి వద్ద నగదు సీజ్..!

calendar_today October 17, 2023
person dharshininews
వ్యాపారి వద్ద నగదు సీజ్..!
వ్యాపారి వద్ద నగదు సీజ్..! - పట్టుకున్న తాండూరు పోలీసులు - వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ తాండూరు, దర్శిని ప్రతినిధి : పెద్ద మొత్తంలో నగదు కలిగిన వ్యాపారి నుంచి పోలీసులు వాటిని సీజ్ చేశారు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో మంగళవారం జరిగింది. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మార్వాడి బజారుకు చెందిన పురోషోత్తం బూబ్ అనే వ్యాపారి నగదుతో బయటకు వచ్చారు. ఎన్నికల కోడ్ లో భాగంగా పోలీసులు పట్టణంలోని శాంత్ మహాల్ చౌరస్తాలో తనిఖీలో చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పురుషోత్తం బూబ్ వద్ద 3,50,000/- రూపాయలను సీజ్ చేయడం జరిగింది. వీటిని స్క్రీనింగ్ కమిటీ ముందు ప్రవేశపెట్టి వాటి యొక్క ఆధారాలను పరిశీలించిన తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుందని సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ను దృష్టిలో ఉంచుకుని ప్రజలు, వ్యాపారులు రూ. 50 వేలకు మించి తరలించొద్దని సూచించారు.