schedule Saturday, September 12, 2026

రూ. 1లక్ష 10 వేలు సీజ్..!

calendar_today October 11, 2023
person dharshininews
రూ. 1లక్ష 10 వేలు సీజ్..!
రూ. 1లక్ష 10 వేలు సీజ్..! - సరిహద్దు చెక్ పోస్టు వద్ద ఘటన - సీజ్ చేసిన బషీరాబాద్‌ పోలీసులు - తహసీల్దార్‌కు అప్పగిస్తామని ఎస్ఐ వెల్లడి తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ పక్కాగా అమలవుతోంది. ఎన్నికల నేపథ్యంలో భారీ నగదును తరలించడకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. నిన్న వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో రూ. 9 లక్షలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు బషీరాబాద్‌ పోలీస్టేషన్ పరిధిలో రూ. 1లక్ష 10 వేలను సీజ్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు బషీరాబాద్‌ మండలంలోని నవాంద్గి సమీపంలో చెక్‌ పోస్టును ఏర్పాటు చేశారు. ఈ చెక్‌ పోస్టు వద్ద 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలో బుధవారం ఓ వ్యక్తి నవాంద్గి నుంచి సేడంకు బైకుపై వెళుతున్నాడు. చెక్‌ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో అతని వద్ద ఎన్నికల కోడ్‌ నిబంధనలు(రూ.50వేల కంటే ఎక్కువగా ఉండడం)కు విరుద్దంగా రూ. 1లక్ష 10 వేల 950లను కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఎస్ఐ వేణుగోపాల్ రెడ్డి సంఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. నగదును గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే వ్యక్తి వద్ద నుంచి నగదును బషీరాబాద్‌ తహసీల్దార్ ముందు ఉంచుతామని వెల్లడించారు. ఈ మేరకు వ్యక్తి వద్ద నుంచి లభించిన నగదును సీజ్ చేయడం జరిగిందన్నారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/20986/