schedule Sunday, July 05, 2026

కారు కోసం కారులో వస్తుండగా..!

calendar_today October 10, 2023
person dharshininews
కారు కోసం కారులో వస్తుండగా..!
కారు కోసం కారులో వస్తుండగా..! - వాహనాల తనిఖీలో డబ్బులు సీజ్ - రూ. 9.50 లక్షలను స్వాదీనం చేసుకున్న పోలీసులు - వికారాబాద్‌ జిల్లాలో ఘటన వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ఎన్నికల కోడ్‌ను అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఎక్కడికి అక్కడ వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. కోడ్‌ అమల్లోకి వచ్చిన రోజే నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్సీలు సూచనలు జారీ చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కారులో డబ్బులతో వస్తుండగా గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరిలాల ఉన్నాయి. హైదరాబాద్‌ లోని మాసబ్ ట్యాంక్ ఆసిఫ్‌ నగర్‌కు చెందిన మహమ్మద్ మొహిత్ తన కారు(టీఎస్09 ఎఫ్‌ఏ 2737)లో హైదరాబాద్‌ నుంచి తాండూరు వైపు వస్తున్నారు. మార్గ మద్యలోని వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ఎన్నికల కోడ్ అమలుల్లో భాగంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మోహిత్ కారులో రూ. 9.50లక్షలు గుర్తించారు. ఎన్నికల కోడ్‌ అమలు ఉండగా ఎవరైనా సరే రూ. 50 వేలకు మించి నగదును కలిగి ఉంటే అందుకు సంబంధించి దృవపత్రాలను చూపించాలని నిబంధన ఉంది. అయితే మొహిత్ వద్ద ఎలాంటి దృవపత్రాలు లేకుండా రూ. 9.50 లక్షలు కలిగి ఉండంతో పోలీసులు వాటిని స్వాదీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా డబ్బులు కలిగి ఉండడంతో పాటు ఎలాంటి దృవపత్రాలు లేనందుకు స్వాదీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. స్వాదీనం చేసుకున్న డబ్బును ఆధాయ పన్ను శాఖకు అప్పగిస్తామని వెల్లడించారు. మరోవైపు యజమాని మోహిత్ మాట్లాడుతూ తాండూరులో కారు కొనుగోలు చేసేందుకని డబ్బులు తీసుకవచ్చినట్లు తెలపడం గమనార్హం. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/20948/