schedule Sunday, September 06, 2026

కోతులపై విషప్రయోగం..!

calendar_today October 6, 2023
person dharshininews
కోతులపై విషప్రయోగం..!
కోతులపై విషప్రయోగం..! - మృత్యువాత పడ్డ 35 వానరాలు - షాకింగ్ సంఘటన ఎక్కడ జరిగిందంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : వానరాలను దైవ రూపాలుగా భావిస్తాం. ఇప్పటికీ అవి చనిపోతే మనషుల మాదిరిగా అంత్యక్రియలు నిర్వహించే సంఘటనలు చూస్తూనే ఉంటాం. అలాంటి మూగజీవాలపై విషప్రయోగం చేశారు. దీంతో 35 కోతులు ఒకేసారి మృత్యువాత పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే... పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బ పల్లి గ్రామ సమీపంలోని స్మశాన వాటిక దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు కోతులకు విషం పెట్టి చంపేశారు. మృతి చెందిన కోతులను తీసుకొచ్చి స్మశాన వాటిక సమీపంలో పడ వేశారు. 35 పైగా కోతులు చనిపోయి ఉన్నాయి. చనిపోయిన కోతులను చూసి స్థానికులు షాక్ గురయ్యారు. వెంటనే స్థానిక సర్పంచ్ శ్రావణ్ కు సమాచారం అందించారు. సర్పంచ్ సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో ఫారెస్ట్ అధికారులు వచ్చి వాటిని పశు వైద్యాధికారి రఘుపతి రెడ్డి ఆయన టీం తో పంచనామా చేయించారు. విషం పెట్టి చంపిన వ్యక్తులు ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏది ఏమైనా మూగజీవాలను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలి తప్ప , విషం పెట్టి చంపడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన వ్యక్తులే ఇలాంటి దారుణ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెబుతున్నారు.. ఈ కోతుల అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20830/