schedule Sunday, July 05, 2026

అయ్యో... భవానీ..!

calendar_today October 3, 2023
person dharshininews
అయ్యో... భవానీ..!
అయ్యో... భవానీ..! - డెంగీ లక్షణాలతో పదేళ్ల బాలిక కన్నుమూత - తాండూరు పట్టణంలో కలకలమైన ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి: డెంగీ లక్షణాలతో పదేళ్ల బాలిక కన్నూమూసిన సంఘటన అందరిని కలిచివేసింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నారి కుటుంబ సన్నిహితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కుక్కింద గ్రామానికి చెందిన మల్లికార్జున స్వామి పురోహితుడు. జీవనోపాధి కోసం తాండూరు పట్టణానికి కోడంగల్ రోడ్డు మార్గంలోని కాలనీలోని సొంతింట్లో స్థిరపడ్డారు. మల్లికార్జున స్వామి కూతురు భవాని(10) స్థానిక గౌతమి మాడల్‌ స్కూల్‌లో 5వ తరగతి చదువుతోంది. ఇటీవల భవాని జ్వరం బారిన పడింది. దీంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని బసవన్న కట్ట వద్ద ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు చికిత్స నిర్వహించి డెంగీ లక్షణాలు ఉన్నట్లు అనుమానించారు. భవాని పరిస్థితి విషమంగా ఉందని వెంటనే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకెళ్తుండగా చేవెళ్ల సమీపంలో మృతి చెందింది. దీంతో కూతురు మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మంగళవారం భవాని అంతక్రియలు నిర్వహించినట్లు తోటి స్నేహితులు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20805/