అసెంబ్లీ ముందు రైతు ఆత్మహత్యాయత్నం
August 5, 2023
dharshininews
అసెంబ్లీ ముందు రైతు ఆత్మహత్యాయత్నం
- పెట్రోల్ పోసుకున్న రైతును ఆపిన పోలీసులు
- రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల రైతుగా గుర్తింపు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా జరుగుతుండగా.. బయట ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని మంట పెట్టుకునే సయానికి పోలీసులు అడ్డుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ సంఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంకు చెందిన రైతుగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామ రైతు ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణలో తనకు అన్యాయం జరిగిందని అన్నదాత వాపోయాడు. 2000 ఎకరాల భూసేకరణ చేసినా ప్రభుత్వం తనకు ఇంకా నష్టపరిహారం చెల్లించలేదన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. గన్‌పార్కు దగ్గర పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/19086