schedule Monday, September 07, 2026

స్కూల్‌ టైమింగ్‌లో చేంజ్..!

calendar_today June 24, 2023
person dharshininews
స్కూల్‌ టైమింగ్‌లో చేంజ్..!
స్కూల్‌ టైమింగ్‌లో చేంజ్..! - అన్ని బడులకు ఒకే సమయం - కసరత్తు చేస్తున్న ఎస్‌సీఈఆర్టీ - ప్రభుత్వం నిర్ణయంపై దృష్టి హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణలోని స్కూళ్ల టైమింగ్‌లో చేంజ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని బడులు ఒకే సమయానికి తెరుచుకోవడంతో పాటూ ముగింపు సమయాన్ని పాటించేలా చర్యలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు సమయాల మార్పుపై ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల పనివేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాయి. ఉన్నత పాఠశాలలు 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో చదివేది చిన్నారులైనందున వారు ఉదయం త్వరగా నిద్ర లేచి, పాఠశాలలకు రాలేరు. ఉన్నత పాఠశాలల్లో చదివేది కాస్త పెద్ద పిల్లలు. ఐతే పాఠశాలల వెళల్లో అందుకు విరుద్దంగా ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటలకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటలకు మొదలవుతున్నాయని కొందరు విద్యాశాఖ దృష్టికి తెచ్చారు. దీంతో అన్ని పాఠశాలు ఉదయం 9.30 లేదా 9.45 గంటలకు ప్రారంభించాలనే యోచనలో ఉంది విద్యాశాఖ. కాని పాఠశాలల సమయాలు మార్చాలంటే ముందుగా ప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంటుంది. నిపుణులతో చర్చించి, అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వ పాఠశాలలకు మరింత నష్టం జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే ప్రమాదం ఉంది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే. ఇదికూడా చదవండి... https://dharshininews.com/18071 chaithany collage