schedule Sunday, September 06, 2026

మే 10న ఇంటర్, 15న టెన్త్ ఫలితాలు

calendar_today April 17, 2023
person dharshininews
మే 10న ఇంటర్, 15న టెన్త్ ఫలితాలు
మే 10న ఇంటర్, 15న టెన్త్ ఫలితాలు - ప్రకటించేందుకు కరసత్తు చేస్తోన్న విద్యాశాఖ - ఎలాంటి ప్రణాళికలు చేశారంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్, పదో తరగతి పరీక్ష ఫలితాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెల మే 10 ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు, అదే నెల 15న పదో పరగతి పరీక్షలను వెల్లడించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఫస్ట్ ఇయర్, సెకండియర్ కలిపి దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు ఈసారి ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు పూర్తయిన తరువాత వెంటనే పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం టెన్త్, ఇంటర్ ఫలితాల వాల్యువేషన్ కొనసాగుతోంది. ఎంసెట్‌తో పాటు ఇతర పరీక్షలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇంటర్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి…. మే 10వ తేదీన ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. మరోవైపు ఈనెల ఏప్రిల్ 11న పదో తరగతి పరీక్షలు ముగియగా.. ఏప్రిల్ 14 నుంచి పదో తరగతి పేపర్ వాల్యూయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 18 సెంటర్లలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్ 21వ తేదీ వరకు వాల్యుయేషన్ కంప్లీట్ చేసి… అనంతరం టేబులేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఇందుకోసం మరో 10 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే..మే 15 టెన్త్ ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదల చేసే అవకాశం ఉంది. https://bse.telangana.gov.in/ ఈ లింక్ పై క్లిక్ చేసి మీ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. 2023 -24 అకడమిక్‌ క్యాలెండర్ ప్రకారం వేసవి సెలవుల తర్వాత జూన్‌ 1 నుంచి ఇంటర్‌ కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుందని బోర్డు వెల్లడించింది. ప్రజంట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్.. ఇంటర్ పుస్తకాలు పక్కనబెట్టి ఇక ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.