schedule Sunday, September 06, 2026

సార్ సెల్‌ ఫోన్‌ నాట్ అలౌడ్..!

calendar_today April 6, 2023
person dharshininews
సార్ సెల్‌ ఫోన్‌ నాట్ అలౌడ్..!
సార్ సెల్‌ ఫోన్‌ నాట్ అలౌడ్..! - పోలీస్‌ కమీషనర్‌ మోబైల్‌ తీసుకున్న కానిస్టేబుల్ - కానిస్టేబుల్‌ను అభినందించి రివార్డు ఇచ్చిన కమీషనర్‌ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో పేపర్‌ లీకేజీ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను కట్టుదిట్టం చేసింది. ఎట్టి పరిస్థితిల్లోనూ ఎవ్వరికి సెల్‌ ఫోన్‌ అనుమతి లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఓ పరీక్ష కేంద్రాన్ని పోలీస్ కమీషనర్‌ సందర్శించేందుకు వచ్చారు. సెల్‌ ఫోన్‌తో లోపలివెళ్లే క్రమంలో ఓ కానిస్టేబుల్ ఉన్నత అధికారి , కమీషనర్‌ అని తెలిసి కూడ సార్‌ సెల్‌ ఫోన్‌ నాట్ అలౌడ్‌ అని గుర్తుచేసింది. వెంటనే కమీషన్ మోబైల్ స్వాదీనం చేసుకుని లోపలికి అనుమతి ఇచ్చింది. ఈ సంఘటన హైదరాబాద్‌ ఎల్బీ నగర్‌ పరిధిలో జరిగింది. గురువారం పదో తరగతి ఇంగ్లిష్‌ పరీక్ష జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్ గురువారం నాడు ఎల్బీనగర్‌లోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అక్కడే ఎల్బీనగర్ పోలీస్టేషన్‌లో పనిచేస్తున్న మహిళ కానిస్టేబుల్ కల్పన విధులు నిర్వహిస్తోంది. తనిఖీలలో భాగంగా కమీషనర్‌ లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోనును కూడా మహిళా కానిస్టేబుల్ కల్పన అనుమతి ఇవ్వకపోవడంతో తన ఫోనును గేటు వద్ద కానిస్టేబుల్‌కి ఇచ్చి లోనికి వెళ్ళారు. నియమ నిబంధనలను గుర్తు చేసి డ్యూటీ సక్రమంగా చేసినందుకు సదరు మహిళా కానిస్టేబుల్ కల్పనను కమీషనర్‌ మెచ్చుకుని 500 రూపాయల రివార్డు ఇచ్చి అభినందనందించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళ కానిస్టేబుల్ కల్పనాను శభాష్‌ అంటూ అభినందిస్తున్నారు.