schedule Monday, September 07, 2026

రేషన్ లబ్దిదారులకు శుభవార్త

calendar_today March 29, 2023
person dharshininews
రేషన్ లబ్దిదారులకు శుభవార్త
రేషన్ లబ్దిదారులకు శుభవార్త - వచ్చే నెల నుంచి బలవర్దక బియ్యం - రాష్ట్రంలోని 11 జిల్లాలలో అమలుకు నిర్ణయం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలోని పేదలందరికీ సంపూర్ణ పోషకాహారం అందించే దిశగా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్దిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలోని పేదలకు వచ్చేనెల ఏప్రిల్ నుంచి బలవర్ధక బియ్యం అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. 2021 సెప్టెంబర్లో జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో బలవర్దక బియ్యం పంపిణీని ఫైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అనంతరం ఐసీడిఎస్, మద్యాహ్నభోజన పథకం, హాస్టళ్లకు అమలు చేశారు. 2022 మే నుంచి ఆదిలాబాద్, అసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రజాపంపిణి చేస్తుంది. ఈ క్రమంలో కొత్తగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండా, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, వికారాబాద్ పరిధిలో బలవర్ధక బియ్యం పంపిణీకి సర్వం సిద్దం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 11జిల్లాల కార్డుదారులందరికీ ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేయనున్నారు. ఐరన్, ఫోలిక్ యాసిడి, విటమిన్ బి12లతో కూడిన బియ్యంతో ప్రజలకు సంపూర్ణ పోషణ లభిస్తుందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, ఐసీడీఎస్, మధ్యాహ్న బోజన పథకాలతో పాటు 11జిల్లాల పరిధిలో ఉన్న ప్రతీ రేషన్ కార్డుదారుకు బలవర్ధక బియ్యాన్ని అందించడం జరుగుతుందని పౌరసరఫరాలా శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. పేదలకు బలవర్దక బియ్యం పంపిణీ చేయడం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజలు పోషకాహార లోపంతో నియంత్రణ జరుగుతుందన్నారు. ఇందులో ముఖ్య పోషకాలైన ఐరన్, ఫోలిక్ ఆసిడ్, బీ12 విటమిన్లతో కూడిన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ఉన్న బియ్యంను రేషన్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.