schedule Monday, September 14, 2026

కాగ్నా గండిపై కదిలిన యంత్రాంగం

calendar_today March 18, 2023
person dharshininews
కాగ్నా గండిపై కదిలిన యంత్రాంగం
కాగ్నా గండిపై కదిలిన యంత్రాంగం - విచారణ ముమ్మరం చేసిన పోలీసుశాఖ - కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వెల్లడి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని కాగ్నానదిలో చెక్‌ డ్యాం పక్కనుంచి కొందరు అక్రమార్కులు గండి కొట్టిన ఘటనపై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. శనివారం వెలుగులోకి వచ్చిన సంఘటనపై తాండూరు పట్టణ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. తాండూరు కాగ్నానదిలో కోట్లాది రూపాయిలతో నిర్మించిన కాగ్నానది చెక్‌ డ్యాం పక్కనే నీరు పారేలా కొందరు అక్రమార్కులు గండి కొట్టేశారు. ఈ పరిణాలపై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కూడ స్పందించారు. పోలీసు, ఇరిగేషన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. మరోవైపు ఈ సంఘటనపై తాండూరు పట్టణ పోలీసులు కూడ స్పందించారు. వెలుగులోకి వచ్చిన కాగ్నానది చెక్‌ డ్యాం పక్క గండిపై విచారణ ముమ్మరం చేశారు. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని వెల్లడించారు.