schedule Sunday, September 06, 2026

రైతులకు గుడ్‌ న్యూస్..!

calendar_today February 27, 2023
person dharshininews
రైతులకు గుడ్‌ న్యూస్..!
రైతులకు గుడ్‌ న్యూస్..! - నేడే పీఎం కిసాన్ నిధులు విడుదల - కొన్ని గంటల్లోనే ఖాతాలో జమ దర్శిని డెస్క్‌: కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రబీ పంటల కోసం ప్రధానమంత్రి-కిసాన్ పథకం కింద నిధులను సోమవారం విడుదల చేయనుందని ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడి దేశంలోని ఎనిమిది కోట్ల మంది అర్హులైన రైతులకు రూ.16,800 కోట్ల విలువైన 13వ విడత ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక ప్రయోజనం అందించబడుతుంది. ఈ నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. ఇప్పటి వరకు 12 విడతలుగా అందించిన సాయం తాజాగా 13వ విడత కింద అందజేయనున్నారు. ఈ-కేవైసీ తప్పనిసరి ఇక పీఎం కిసాన్‌ డబ్బులు పొందుతున్న రైతులకు ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది కేంద్రం. పీఎం కిసాన్‌ సాయం పొందుతున్న రైతులు ఈ కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేసుకోలేని రైతులకు ఈ 13వ విడత డబ్బులు అందవు. ఆధార్‌తో పాటు భూమికి సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.