schedule Monday, September 07, 2026

శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

calendar_today January 2, 2023
person dharshininews
శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి - కుటుంబ సమేతంగా వైకుంఠ దర్శనం - చేవేళ్ల, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు కూడ తాండూరు, దర్శిని ప్రతినిధి: శ్రీవారి సన్నిధిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తరించారు. సోమవారం తొలి వైకుంట ఏకాదశి పురష్కరించుకొనీ తిరుమల శ్రీవారి శ్రీ వేంకటేశ్వర స్వామిని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి వికారాబాద్‌ జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, కుమారుడు పట్నం రీనిష్ రెడ్డి, మనీష రెడ్డి, కుటుంబం సభ్యులతో పాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఆయన సతీమణి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్, షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యుల తో కలసి శ్రీ వేంకటే్వరస్వామిని దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలంతరు సుఖసంతోషాలతో జీవించాలని శ్రీవారిని వేడుకున్నారు.