schedule Sunday, September 06, 2026

మహిళలకోసం ఎల్‌ఐసీ ప్రత్యేక పాలసీ

calendar_today November 15, 2022
person dharshininews
మహిళలకోసం ఎల్‌ఐసీ ప్రత్యేక పాలసీ
మహిళలకోసం ఎల్‌ఐసీ ప్రత్యేక పాలసీ - రోజూ రూ. 29 జమకు రూ. 4 లక్షలు సొంతం - ఎలా సొంతం చేసుకోవచ్చో తెలుసుకోండి దర్శిని డెస్క్: దేశంలో లైఫ్‌ కార్పోరేషన్‌ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) గురించి తెలియని వారు ఎవ్వరు ఉండరు. చిన్నా పెద్దా నుంచి నిరుపేదల వరకు ఎన్నో బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకవస్తుంది. అందులో మహిళల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన ఓ పాలసీ గురించి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ఎల్‌ఐసీ సంస్థ ఆధ్వర్యంలో ఎల్‌ఐసీ ఆధార్‌ శిలా ప్లాన్‌ ప్రత్యేకంగా మహిళలు, అమ్మాయిల కోసమే ప్రవేశ పెట్టారు. ఈ పాలసీ తీసుకుంటే మినిమం రిటర్న్‌ రూ. 75 వేలు గ్యారంటీగా పొందొచ్చు. అయితే గరిష్ట పరిమితి మాత్రం 3 లక్షలకు మించదు. అంటే పాలసీదారుడు గరిష్టంగా రూ. 3 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టొచ్చు. ఈ పాలసీ మెచ్యూరిటీ పీరియడ్‌ 1 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఉంటుంది. పాలసీ ప్రీమియంను నెలవారీ, త్రైమాసిక, అర్థ వార్షిక లేదా వార్షిక వాయిదాల్లో చెల్లించవచ్చు. ఇక ఈ పాలసీని 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసున్న మహిళలు తీసుకొవచ్చు. ఈ ప్లాన్ ద్వారా నెలకు రూ. 29 జమ చేస్తే రూ. 4 లక్షల రూపాయలు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు ఈ పాలసీ ద్వారా రోజుకు రూ. 29 పెట్టుబడిగా పెడితేజ. ఏడాదికి రూ. 10,959 మొత్తం అవుతుంది. 30 ఏళ్ల వయసులో ఈ పాలసీని తీసుకుంటే 20 ఏళ్ల పాటు రోజుకు రూ.29 చెల్లించుకుంటూపోతే మొత్తం రూ. 2,14,696 పెట్టుబడిగా పెడ్తారు. పాలసీ మెచ్యూరిటీ పీరియడ్‌ ముగిసిన తర్వాత రూ. 3,97,000 వరకు రిటర్న్‌ పొందొచ్చు. ఎల్ఐసీ తీసుకవచ్చిన ఆధార్ శిలా పాలసీ మహిళలకు సువర్ణ అవకాశం అనే చెప్పొచ్చు.