schedule Monday, September 07, 2026

ద‌ర్నాల‌తో ద‌ద్ద‌రిల్లాలి

calendar_today July 31, 2022
person dharshininews
ద‌ర్నాల‌తో ద‌ద్ద‌రిల్లాలి
ద‌ర్నాల‌తో ద‌ద్ద‌రిల్లాలి - 5న రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు - పిలుపునిచ్చిన టీపీసీసీ అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి హైదరాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ద‌ద్ద‌రిల్లేలా ద‌ర్నాలు చేప‌ట్టాల‌ని తెలంగాణ టీపీసీసీ అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఆగస్టు 5న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వరదలు, వర్షాల కారణంగా దాదాపు రూ.2వేల కోట్ల నష్టం జరిగింది. అయినా, కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎలాంటి చలనం లేదు. వరద బాధితులను ఆదుకోవడంలో రెండు ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో పాటు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరల పెంపు, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, అగ్నిపథ్‌ తదితర అంశాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు వివరించారు. నిత్యావసరాలపై జీఎస్టీ పెంపునకు నిరసనగా గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానుల్లో పీసీసీ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనేలా కార్యాచరణ చేపట్టాలి’’ అని పార్టీ శ్రేణులకు రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.