schedule Monday, September 07, 2026

కాగ్న‌న‌దిలో గంగ‌మ్మ ప‌ర‌వ‌ళ్లు

calendar_today July 26, 2022
person dharshininews
కాగ్న‌న‌దిలో గంగ‌మ్మ ప‌ర‌వ‌ళ్లు
కాగ్న‌న‌దిలో గంగ‌మ్మ ప‌ర‌వ‌ళ్లు - పూజలు చేసిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి - సందర్శించిన చైర్ పర్సన్, నేతలు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులో ప్రసిద్ధి చెందిన కాగ్నానదికి మంగళవారం ఉదయం నుంచి వరధనీరు పోటెత్తింది. ఈ వర్షాకాలంలో మొదటిసారి భారీ ఎత్తున నీరు ప్రవహించింది. కాగ్నానదికి గంగ‌మ్మ ప‌రవ‌ళ్లు తొక్కింది. ఈ విష‌యం తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నదిని సందర్శించారు. కాగ్నానదిలో నీరు రావడం పట్ల ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, స్థానిక నేతలతో కలిసి నదిలోని గంగమ్మకి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, కౌన్సిలర్ నీరజాబాల్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, గడ్డలి రవీందర్, బషీరాబాద్ పీఏఎసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఇందూరు ప్రకాష్, శ్రావణ్ * కుమార్, బన్సిలాల్, అగ్గనూర్ సర్పంచ్ భీమప్ప. వెంకటయ్య, అశోక్, బీదర్ రాజశేఖర్, సిద్దూ, దత్తూ తదితరులు ఉన్నారు.