schedule Saturday, July 04, 2026

మొక్కలతోనే మనుగడ

calendar_today June 18, 2026
person dharshininews
మొక్కలతోనే మనుగడ
మొక్కలతోనే మనుగడ - నాటిన వాటిని బాధ్యతగా సంరక్షించాలి - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మొక్కలు నాటి సంరక్షించడం వల్ల మానవ మనుగడ సాధ్యమవుతోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి క్యాంపు కార్యాలయన ఆవరణలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. నాటిన మొక్కలకు నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్కల సంరక్షణతోనే మానవాళి మనుగడ సాధ్యమని వక్తలు పేర్కొన్నారు. ప్రాణవాయువు దక్కాలంటే పచ్చదనం కీలకమన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలన్నారు. పచ్చదనంతో పరిఢవిల్లేలా వన సంరక్షణకు పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, సర్‌ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, నాయకులు సర్దార్ ఖాన్, ఎంఏ అలీం, అఫ్పూ(నయూం) ప్రభాకర్ గౌడ్, లింగదళి రవికుమార్, కోర్వార్ నగేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్,పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, మండలాల అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43561/