schedule Saturday, July 04, 2026

నిందితురాలి ఆత్మహత్యాయత్నం..!

calendar_today May 17, 2026
person dharshininews
నిందితురాలి ఆత్మహత్యాయత్నం..!
నిందితురాలి ఆత్మహత్యాయత్నం..! - కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌లో ఘటన - మోయినబాద్‌ హత్యల కేసులో విచారిస్తుండగా ఘాతుకం తాండూరు, దర్శిని ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలు కరీమాబేగం ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. పోలీస్టేషన్‌లో విచారిస్తుండగా బాతురూంకని వచ్చి సూసైడ్‌కు యత్నించింది. ఈ ఘటన ఆదివారం కలకలం రేపింది. మోయినాబాద్‌ తోల్కట్ట ఫాం హౌస్‌ వద్ద ఆబేదాబేగం, మహబూబాబీ.. తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీలో ఉండే దంపతులు కరీమాబేగం, రెహమాన్, వీరి బంధువు నయీంకు కలిసి వారిని నమ్మించి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. నిందితులు మృతుల వద్ద వేర్వేరుగా కొంత డబ్బు అప్పుగా తీసుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని మహిళలు ఒత్తిడి తీసుకరావడంతో వారిని చంపేయాలని కరీమాబేగం, రెహమాన్, నయీం పథకం వేశారు. డబ్బు ఇస్తామని నమ్మించి ముందుగా మహబూబాబీని మొయినాబాద్‌ సమీపంలోని తోల్కట్ట ఫౌంహౌస్‌ వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసి, అక్కడే గొయ్యి తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఆ తరువాత ఆబేదాబేగంను కూడా అక్కడికే తీసుకెళ్లి అదేరీతిలో హత్య చేసి పాతిపెట్టారు. ఈ కేసులో కరీమాబేగంను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం కరణ్‌కోట్‌ పీఎస్‌లో విచారిస్తుండగా.. బాత్రూమ్‌కు వెళ్లిన ఆమె ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యకు యత్నించారు. హుటాహుటిన ఆమెను చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు. https://www.dharshininews.com/43337/