schedule Friday, September 04, 2026

చేతిలో కుర్చిలాట..!

calendar_today April 3, 2026
person dharshininews
చేతిలో కుర్చిలాట..!
చేతిలో కుర్చిలాట..! - అధ్యక్ష పదవుల కోసం పట్టు - ఒకరికిస్తే మరోకరికి తప్పని నిరాశ - ఎమ్మెల్యేపైనే ఎంపిక భారం తాండూరు, దర్శిని ప్రతినిధి : అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం ఆశావాహుల ఎదురుచూపులు తప్పడం లేదు. తాండూరు నియోజకవర్గంలో అధ్యక్ష పదవుల కోసం కుర్చీలాట రసవత్తరంగా సాగుతోంది. పదవులను పొందించేందుకు ఆశావాహులు పట్టుబిగిస్తున్నారు. ఆశావాహులు పెరుగుతుండడంతో ఒకరికి ఇస్తే.. మరోకరికి నిరాశ తప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పాత నేతలు, ఎన్నికల ముందు పార్టీలో చేరిన నేతల మద్య పదవుల పందేరం కొనసాగుతుండడం చర్చనీయాశంగా మారింది. తాండూరు పట్టణ అధ్యక్ష పదవి కోసం పాత, కొత్త నేతల మద్య పోటీ పెరిగింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో తాండూరు పట్టణ అధ్యక్ష పదవిని మాజీ కౌన్సిలర్ జుబేర్ లాలకు అందిస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రకటించారు. ఇదే పదవి కోసం కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నాయకులు, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదళి రవికుమార్ పోటికి వచ్చారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు బాతుల నాగేష్ కూడా పట్టణ అధ్యక్ష పదవి కావాలంటూ తెరమీదకు వచ్చారు. ఈ పదవి తమకే వస్తుందని ఎవరి ధీమాలో వారు ఉన్నారు. అయితే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఒకరికి మాట ఇస్తే తప్పరని ప్రజల్లో, పార్టీ నేతల్లో నమ్మకం ఉంది. ఇటీవలే డీసీసీ కార్యవర్గం ఎన్నిక కావడంతో మండలాల అధ్యక్ష పదవుల ఎంపికపై ప్రాధాన్యత సంతరించుకుంది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్‌లపై ఎంపిక భారం పడింది. తాండూరు, పెద్దేముల్, యాలాల మండలాల్లో మహిపాల్ రెడ్డి, ఎల్లారెడ్డి, వెంకటయ్యల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బషీరాబాద్‌ మండలంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే నారాయణరావు సూచించిన వ్యక్తికి పదవిని ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా రాష్ట్ర, జిల్లా, పట్టణ స్థాయిలో నామినేటేడ్ పదవులపై పార్టీలోని సీనీయర్‌ నేతలు ఆశలు పెట్టుకున్నారు. https://www.dharshininews.com/42934/