schedule Thursday, September 03, 2026

అనుమతుల్లేకుండా ఇసుక రవాణా..!

calendar_today February 21, 2026
person dharshininews
అనుమతుల్లేకుండా ఇసుక రవాణా..!
అనుమతుల్లేకుండా ఇసుక రవాణా..! - మూడు ట్రాక్టర్లను పట్టుకున్న యాలాల పోలీసులు - కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విఠల్‌ రెడ్డి వెల్లడి తాండూరు, దర్శిని ప్రతినిధి : అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను యాలాల పోలీసులు పట్టుకున్నారు. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శనివారం యాలాల మండలం అగ్గనూర్ గ్రామ సమీపంలోని వాగు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టీఎస్ 34 ఏ 8370, టీఎస్ 34 జి 3974, టీఎస్ 34 డి 0510 నంబర్లు గల మూడు ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. వాటిని అడ్డగించి అనుమతులు చూపించాలని కోరగా ఎలాంటి పర్మిషన్లు లేవని తెలిసింది. దీంతో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు నిర్ధారించి వాటిని సీజ్ చేసి యాలాల పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు ట్రాక్టర్లు యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. https://www.dharshininews.com/41999/