schedule Saturday, September 05, 2026

ప్రజా ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ గెలుపు

calendar_today February 14, 2026
person dharshininews
ప్రజా ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ గెలుపు
ప్రజా ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ గెలుపు - ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు - 24వ వార్డు కౌన్సిలర్ బాలకృష్ణారెడ్డి - పార్టీ ఇంచార్జీ కావాలి సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని 24వ వార్డు ప్రజల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించిందని వాడు కౌన్సిలర్ పోలీస్ బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ వార్డు ఇంచార్జ్ కావల సంతోష్ కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 24 వార్డు నుంచి కౌన్సిలర్ గా గెలిపించడం పట్ల వారు వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. వార్డులో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించడం కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో వార్డును అభివృద్ధి పరచడంతో పాటు.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయమని అన్నారు. ఎన్నికల్లో గెలుపుకు కృషి చేసిన యువతకు, ప్రజలకు, మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. https://www.dharshininews.com/41277/