schedule Saturday, September 05, 2026

హస్తం ఖాతాలో మరో హాట్రిక్ కౌన్సిలర్..!

calendar_today February 13, 2026
person dharshininews
హస్తం ఖాతాలో మరో హాట్రిక్ కౌన్సిలర్..!
హస్తం ఖాతాలో మరో హాట్రిక్ కౌన్సిలర్..! - 12వ వార్డులో పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి విక్టరీ - భారీ మెజార్టీతో ఎన్నికల్లో గెలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో మరో హాట్రిక్‌ కౌన్సిలర్ చేరారు. పట్టణంలోని సాయిపూర్ 12వ వార్డు నుంచి పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. మొదటి, రెండో సారి బీఆర్ఎస్ కౌన్సిలర్‌గా పనిచేసిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ హాట్రిక్ విజయాన్ని అందించింది. శుక్రవారం వెలువడిన ఫలితాలలో పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో భారీ ఉత్కంఠను రేపింది. సాయిపూర్‌లోని 12వ వార్డులో విజయం ఎవరిది అనేది బెట్టింగ్‌లు వేసుకున్నారంటే అర్థం చేసుకోండి ఈ వార్డు ఎంత ప్రతిష్టాత్మకమైందో. బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ అందించినా పట్లోళ్ల నీరజా గెలుపును ఆపలేకపోయారు. ఓట్ల లెక్కింపులో పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి బీజేపీపై 424 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి మూడో సారి కౌన్సిలర్‌గా హాట్రిక్ కోట్టారు. https://www.dharshininews.com/41257/