schedule Saturday, September 05, 2026

కాంగ్రెస్ పార్టీని ఆదరించండి..!

calendar_today February 8, 2026
person dharshininews
కాంగ్రెస్ పార్టీని ఆదరించండి..!
కాంగ్రెస్ పార్టీని ఆదరించండి..! - పార్టీ నాయకురాలు బ్రమరాబ - 28వ వార్డు అభ్యర్థి తరుపున ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ నాయకురాలు బ్రమరాంబ కోరారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 28వ వార్డు అభ్యర్థి మేడి విజయ భాస్కర్ తరుపున ఆమె ప్రచారం చేశారు. ఈప్రచారంలో పార్టీ సీనీయర్ నాయకులు సర్దార్ ఖాన్, కౌన్సిలర్ అభ్యర్థి మేడి విజయ్‌ భాస్కర్ తో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలుస్తూ కాంగ్రెస్ అభ్యర్థి మేడి భాస్కర్ గెలుపుకోసం చేతి గుర్తుకు ఓటేయాలని సూచించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో వార్డును ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని ప్రజలకు భరోసా అందించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/41110/