schedule Saturday, September 05, 2026

రేపు తాండూరుకు కేటీఆర్ రాక..!

calendar_today February 7, 2026
person dharshininews
రేపు తాండూరుకు కేటీఆర్ రాక..!
రేపు తాండూరుకు కేటీఆర్ రాక..! - పట్టణంలో రోడ్‌ షో నిర్వహణ - జయప్రదం చేయాలని రోహిత్ రెడ్డి పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు. శనివారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో రోహిత్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం తాండూరుకు కేటీఆర్ వస్తున్నట్లు వెల్లడించారు. రేపు ఉదయం 9గంటలకు తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో కేటీఆర్ రోడ్‌ షో ఉంటుందని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి, బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు, డా.సంపత్ కుమార్, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/41059/