schedule Saturday, September 05, 2026

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా జుబేర్ లాల

calendar_today February 4, 2026
person dharshininews
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా జుబేర్ లాల
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా జుబేర్ లాల - త్వరలో నియమిస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులుగా మాజీ కౌన్సిలర్ నియామకం అవుతున్నారు. ఈవిషయాన్ని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం రాత్రి తాండూరు పట్టణంలోని 21వ వార్డులో పార్టీ ఆధ్యక్షులు హబీబ్ లాల, జుబేర్ లాలల ఆత్మీయ కలయిక జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ జుబేర్ లాలను కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ నూతన అధ్యక్షులుగా నియమించబోతున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల తరువాత ఈనెల 18న అధిష్టానం నిర్ణయం మేరకు జుబేల్ లాలను పట్టణ అధ్యక్షులుగా నియమించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని సన్మానించారు. హబీబ్ లాల. జుబేర్ లాలకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నాయకులు ఉత్తమ్ చంద్, అబ్దుల్ రవూఫ్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40977/