schedule Saturday, July 04, 2026

నలుగురు పేకాటరాయుళ్లపై కేసు

calendar_today January 9, 2026
person dharshininews
నలుగురు పేకాటరాయుళ్లపై కేసు
నలుగురు పేకాటరాయుళ్లపై కేసు - కేసు నమోదు చేసిన బషీరాబాద్‌ పోలీసులు బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : పేకాట ఆడుతూ పట్టుబడిన నలుగురు పేకాటరాయుళ్లపై బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. బషీరాబాద్‌ ఎస్ఐ నూమన్ అలీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండల కేంద్రంలో కళ్ళు కాంపౌండ్ అశోక్ గౌడ్ దుకాణం వెనకాల పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకొని దాడులు నిర్వహించారు. అక్కడ పేకాట ఆడుతున్న పాష నాయక్ తాండాకు చౌహాన్ శివరాం, బషీరాబాద్‌కు చెందిన షాభోద్దీన్, మహబూబ్, శ్రీనివాస్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వారి వద్ద నుంచి రూ. 1360లను స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేస్తున్నట్టు బషీరాబాద్ ఎస్సై నుమాన్ ఆలీ తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40488/