schedule Saturday, September 05, 2026

షాపు వెళ్లగానే ఇంట్లో చోరీ..!

calendar_today November 18, 2025
person dharshininews
షాపు వెళ్లగానే ఇంట్లో చోరీ..!
షాపు వెళ్లగానే ఇంట్లో చోరీ..! - బంగారం, తులాల వెండి ఆభరణాల ఆపహరణ - రాజీవ్ కాలనీలో ఘటన, దర్యాప్తు చేపట్టిన పోలీసులు - పరిశీలించిన యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటికి తాళం షాపుకు వెళ్లిన ఓ మహిళ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరికి పాల్పడ్డారు. అరగంటలోనే ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు అపహరించుకుపోయారు. ఈ సంఘటన మంగళవారం యాలాల పోలీస్టేషన్ పరిధి, తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలో జరిగింది. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి రాజీవ్ కాలనీ చెందిన పోతుల బుజ్జమ్మ మాతా శిశు ఆసుపత్రి వద్ద షాపు నిర్వహిస్తోంది. మంగళవారం ఉదయం 10-30గంటల ప్రాంతంలో ఇంటికి తాళం వేసి షాపు వద్దకు వెళ్లింది. తిరిగి 11 గంటలకు వచ్చే సరికి ఇంటి తాళం విరగొట్టినట్లు కనిపించింది. ఇంట్లోకి వెళ్లి చూడగా బిరువాలో ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలు కమ్మలు, బ్రాస్ లెట్, నాను, రింగులతో పాటు 50 తులాల వెండిని దోచుకెళ్లినట్లు గుర్తించింది. వెంటనే యాలాల పోలీస్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఐ విఠల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి విచారణ చేపట్టారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39706/