schedule Saturday, July 04, 2026

ఎల్లన్న ఆధైర్య పడకు.. మేముంటాం..!

calendar_today November 7, 2025
person dharshininews
ఎల్లన్న ఆధైర్య పడకు.. మేముంటాం..!
ఎల్లన్న ఆధైర్య పడకు.. మేముంటాం..! - పేర్కంపల్లిలో గబ్బర్ సింగ్ గ్యాంగ్ ఓదార్పు - అక్కా చెళ్లెళ్ల కుటుంబానికి పరామర్శ - ఏపీ డీప్యూటీ సీఎం ఆదేశంతో భరోసా తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎల్లన్న ఏం భయపడకు.. మేముంటాం.. మీకు అండగా అంటూ గబ్బర్ సింగ్ ఆర్టిస్టులు అభయమిచ్చారు. చేవేళ్ల మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యాలాల మండలం పేర్కంపల్లి గ్రామానికి చెందిన తనూష, సాయిప్రియ, నందిని ముగ్గురు అక్కా చెల్లెళ్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గబ్బర్ సింగ్ సినిమాలో గ్యాంగ్‌ ఆర్టిస్టులు శుక్రవారం పేర్కంపల్లి గ్రామాన్ని సందర్శించారు. అక్కా చెల్లెళ్ల తండ్రి ఎల్లయ్య గౌడ్‌ను కలిసి పరామర్శించారు. కుటుంబానికి తమవంతుగా అండగా ఉంటామని భరోసా అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ చేవేళ్ల రోడ్డు ప్రమాదం సంఘటను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. kvcs మీరు వెళ్లి చూసి రండి.. సాయం అందిద్దామని మాట ఇవ్వడంతో ఆయన ఆదేశాలతో గ్రామానికి వచ్చినట్లు వివరించారు. కుటుంబానికి జనసేన పార్టీ తరపున, తమ వ్యక్తిగత అండగా వారికి సహాయం చేస్తామని టీమ్ సభ్యులు తెలిపారు. దీంతోపాటు చేవేళ్ల రోడ్డును బాగుచేవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఇలాంటి ఘోర ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే రోడ్డు మరమ్మతులు అత్యవసరం అని వారు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39492/