schedule Thursday, September 03, 2026

పేదల ఆరోగ్యానికి వరం..!

calendar_today October 26, 2025
person dharshininews
పేదల ఆరోగ్యానికి వరం..!
పేదల ఆరోగ్యానికి వరం..! - బాధితుల కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ భరోసా - ఎల్‌ఓసీలను అందజేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యాలతో బాధపడుతున్న బాధితులకు తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న సీఎంఆర్ఎఫ్ పథకం భరోసా అందిస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన రావుల అరుణకు సీఎంఆర్ఎఫ్ కింద రూ. 2లక్షలు మంజూరురయ్యాయి. అదేవిధంగా పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన అంతారం లలితకు రూ. 2లక్షల 25వేలు మంజూరయ్యాయి. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు ఈ ఎల్వోసీలను అందజేశారు. kvcs ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరంగా మారిందని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు జర్నప్ప, లొంక నర్సింలు, ఉప్పరి మల్లేశం తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39262/