schedule Monday, September 07, 2026

కొంపముంచిన నిద్రమత్తు..!

calendar_today September 15, 2025
person dharshininews
కొంపముంచిన నిద్రమత్తు..!
కొంపముంచిన నిద్రమత్తు..! - డ్రైనేజీలోకి దూసుకెళ్లిన కారు - తాండూరు ఇందిరా చౌరస్తా వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : నిద్రమత్తులో చేస్తున్న కారు డ్రైవింగ్ కొంపముంచింది. అదుపు తప్పిన కారు ఏకంగా నిర్మాణంలో ఉన్న డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. kvcs ఈ సంఘటన తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారు జామున కోడంగల్ రోడ్డు నుంచి ఇందిరా చౌరస్తా వైపు కారు అదుపు తప్పి ఓ వైన్‌ షాపు ముందు నిర్మిస్తున్న డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. గమనించిన స్థానికులు డ్రైవర్‌ ను బయటకు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. ఈ ప్రమాదం నుంచి బయట పడిన వారి వివరాలు తెలియరాలేదు. తాండూరు పట్టణానికి చెందిన వ్యక్తులే అని చెబుతున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/38601/