schedule Tuesday, September 08, 2026

ఫార్మర్లతో టైంపాస్..!

calendar_today September 8, 2025
person dharshininews
ఫార్మర్లతో టైంపాస్..!
ఫార్మర్లతో టైంపాస్..! - ట్రాన్స్‌ఫార్మర్‌ ఇవ్వకుండా డ్రామా - గేటుకు ట్రాక్టర్ అడ్డం పెట్టిన రైతులు - విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ అధికారులు మాతో టైంపాస్‌ చేశారని రైతులు మండిపడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారని కార్యాలయం గేటు వద్ద ట్రాక్టర్ అడ్డం పెట్టి ఆందోళనకు దిగారు. kvcs ఈ సంఘటన సోమవారం తాండూరు పట్టణంలోని విద్యుత్ కార్యాలయం వద్ద జరిగింది. ఇందుకు సంబంధించి బాధిత రైతులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాలాల మండలం లక్ష్మీనారాయణ పూర్‌కు చెందిన రైతు పంట పొలంలో గత పది రోజుల క్రితం ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది. దీంతో విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. రోజులు గడుస్తున్నా పట్టించుకోలేదు. దీంతో సోమవారం ట్రాక్టర్లో ట్రాన్స్‌ఫార్మర్‌ని తీసుకొని తాండూర్ విద్యుత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 12 గంటలకు కార్యాలయానికి వచ్చిన సాయంత్రం ఆయన కూడా అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ ఇవ్వలేదు. అప్పటికే మరో రైతు కూడా ఇదే సమస్యతో కార్యాలయానికి వచ్చాడు. సాయంత్రం 5గంటలకుముందు టైం లేదు.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఇవ్వం.. రేపు రండి అని అధికారులు చెప్పడంతో రైతులు అసహనం కోల్పోయారు. ఓ వైపు పంటలు ఎండిపోతుంటే అధికారులు టైం పాస్‌ చేస్తారా అంటూ మండిపడ్డారు. తెచ్చిన ట్రాక్టర్‌ను గేటు వద్ద అడ్డం పెట్టి రైతులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అధికారుల తీరులతో మాట్లాడించి ట్రాన్స్‌ఫార్మర్‌ ఇప్పిస్తామని భరోసా ఇవ్వడంతో రైతులు శాంతించి దర్నా విరమించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38470/