నిమజ్జనంలో పోలీసుల ఆంక్షలు..!
August 30, 2025
dharshininews
నిమజ్జనంలో పోలీసుల ఆంక్షలు..!
- ఊరేగింపులో డీజే వినియోగంపై క్లారీటీ
- ఆ రూల్స్ మీరితే కేసులు తప్పవు
- ప్రకటించిన తాండూరు పోలీసుల ఆంక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఆదివారం జరిగే వినాయక నిమజ్జనంలో డీజే సౌండ్కు పర్మిషన్ లేదని పోలీసులు స్పష్టం చేశారు. వినాయక నిమజ్జనంలో మండపాల నిర్వహకులు పాటించాల్సిన నియమాలు, పోలీసులు విధించిన ఆంక్షలను శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
వినాయన నిమజ్జన ఊరేగింపులో డీజేకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదన్నారు. ఒకవేళ ఎవరైనా రూల్స్ అతిక్రమించి డీజే వాడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టణంలో ప్రతిష్టించిన 15 ఫీట్ల నుంచి 20 ఫీట్ల వరకు ఉన్న వినాయకులను ఊరేగింపుగా రాకుండా నేరుగా నిమజ్జనానికి తరలించాలని సూచించారు. మిగతా వినాయకులు భద్రేశ్వర గుడి నుంచి తరలించాలని అన్నారు.
వినాయకుల ఊరేగింపు మందు బ్యాండు భాజాలపై కూడా ఆంక్షలు విధించడం జరిగిందని తెలిపారు. మండపాల నిర్వహకులు భద్రేశ్వర దేవాలయం వరకు బ్యాండు భాజాలతో తరలించుకోవచ్చని, దేవాలయం దాటిన తరువాత ఎలాంటి శబ్దాలు లేకుండా తరలించాలన్నారు. వినాయకులను అర్ధరాత్రి ముగిసేలోపు తరలించాలని, తెల్లవారు జామున 5 గంటలకు తరలించేందుకు అనుమతులు లేవని అన్నారు. ఎలాంటి అల్లర్లు, అవాంతరాలు కలగకుండా నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకుని సహకరించాలని సూచించారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/38239/