schedule Tuesday, September 08, 2026

మనోహరన్న మానవత్వం..!

calendar_today August 25, 2025
person dharshininews
మనోహరన్న మానవత్వం..!
మనోహరన్న మానవత్వం..! - రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలింపు - ఎమ్మెల్యే చొరవకు నాయకులు ఫిదా తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడిని గమనించి.. కారు ఆపి మరీ దగ్గరికి వెళ్లారు. వెంటనే ఆటోను పిలపించి దగ్గరుండి ఆసుపత్రికి పంపించారు. kvcs సోమవారం తాండూరు మండల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. తాండూరు పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై తాండూరు మండలం చెన్‌గెష్‌పూర్‌ గ్రామానికి చెందిన పెద్దమనిషి రోడ్డు ప్రమాదానికి గురైన విషయం కారులో వెళుతున్న ఎమ్మెల్యే గమనించారు. వెంటనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కారు దిగి బాధితుడిని పలకరించారు. అతనికి రక్తగాయాలు కావడంతో వెంటనే ఆటో ఆపించి అతడికి అందులో ఎక్కించారు. త్వరగా ఆసుపత్రికి చేరుకునేలా ఆదేశించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మానవత్వానికి వెంట ఉన్న నాయకులు, స్థానికులు ఫిదా అయిపోయారు. ఎమ్మెల్యే వెంట డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38132/