schedule Tuesday, September 08, 2026

రోడ్డుపై అక్రమణలపై కొరడా..!

calendar_today May 30, 2025
person dharshininews
రోడ్డుపై అక్రమణలపై కొరడా..!
రోడ్డుపై అక్రమణలపై కొరడా..! - షెడ్లు, ఇతర నిర్మాణాల తొలగింపు - పోలీసులతో కలిసి తీసివేసిన మున్సిపల్ సిబ్బంది - వ్యతిరేకించిన వ్యాపారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని రోడ్లపై ఏర్పాటు చేసిన ఆక్రమణలపై అధికారులు కొరడా జులిపించారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిర్మాణాలను తీసివేశారు. తాండూరు పోలీసు సహాకారంతో తొలగింపు చర్యలు చేపట్టారు. తాండూరు పట్టణ మీదుగా జాతీయ రోడ్డు నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణంలో ఇదివరకే రోడ్లకు ఇరువైపులా నిర్మించిన భారీ సైడ్ డ్రైన్ లపై పలువురు వ్యాపారులు దుకాణాల ముందు షెడ్లు, ఇతర నిర్మాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నిర్మాణాల వల్ల ట్రాఫిక్ తో పాటు ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి తాండూరు పట్టణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఆక్రమణల తొలగింపు చేపడుతున్నారు. తాజాగా శుక్రవారం పట్టణ పోలీసుల సహాకారంతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్, జవాన్లు ఆక్రమణలు తొలగించారు. మున్సిపల్ జేసీబీ స హాయంతో దుకాణాల ముందు నిర్మించుకున్న షెడ్లు, ఇతర నిర్మాణాలను తొలగించారు. నిర్మాణాల తొలగింపు సమయంలో వ్యాపారుల నుంచి వ్యతిరేకత కనిపించింది. అధికారులు ఎలాంటి నోటీసులు, సమాచారం అందించకుండా తొలగిపు చర్యలు తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రోడ్లపై నిర్మించిన ఆక్రమణలు తొలగించారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/35844/