schedule Tuesday, September 08, 2026

ఉపాధి కూలి మృతి

calendar_today May 27, 2025
person dharshininews
ఉపాధి కూలి మృతి
ఉపాధి కూలి మృతి - పనికి వెళ్లి వస్తుండగా కుప్పకూలిన వ్యక్తి - యాలాల మండలం తిమ్మాయిపల్లిలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉపాధి పనులకు వెళ్లిన ఓ కూలి కుప్పకూలి కిందపడి మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు.. మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన అన్నారం హన్మంతు(38) మంగళవారం ఉదయం గ్రామంలో జరిగే ఉపాధి పనులకు వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే హన్మంతు మృతి చెందినట్లు నిర్దారించారు. అయితే హన్మంతుకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన సంఘటనపై యాలాల పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35782/