schedule Tuesday, September 08, 2026

అక్రమ రవాణాకు.. 'చెక్'..!

calendar_today May 26, 2025
person dharshininews
అక్రమ రవాణాకు.. 'చెక్'..!
అక్రమ రవాణాకు.. 'చెక్'..! - సరిహద్దులో నిరంతర నిఘా - బషీరాబాద్‌ ఎస్ఐ శంకర్‌ - మైల్వార్ వద్ద చెక్ పోస్టు ఏర్పాటు బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : మూగ జీవాల అక్రమ రవాణకు చెక్‌ పెట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని బషీరాబాద్‌ ఎస్ఐ శంకర్ తెలిపారు. సోమవారం బషీరాబాద్‌ పోలీస్టేషన్ పరిధి.. తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక సరిహద్దులో ఉన్న మైల్వార్ గ్రామంలో పోలీసు శాఖ తరుపున చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ చెక్‌ పోస్టును ఎస్ఐ శంకర్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వచ్చేనెల 7న జరిగే బక్రీద్ పండగ సందర్భంగా ఈ చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్ ఆదేశాల మేరకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మద్య మూగ జీవాల అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. నిరంతరం నిఘా ఉంచి అక్రమ రవాణాకు చెక్‌ పెట్టడమే లక్ష్యమన్నారు. ఎవరైనా ఎలాంటి అనుమతులు లేకుండా మూగజీవాలను తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35754/