schedule Tuesday, September 08, 2026

కర్ణాటక నుంచి ఒక్క బస్తా రావోద్దు..!

calendar_today May 14, 2025
person dharshininews
కర్ణాటక నుంచి ఒక్క బస్తా రావోద్దు..!
కర్ణాటక నుంచి ఒక్క బస్తా రావోద్దు..! - ధాన్యం అక్రమ రవాణాపై గట్టి నిఘా - అక్రమ రవాణా అడ్డుకట్టకు ప్రత్యేక తనిఖీలు - వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి - కొత్లాపూర్ అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు తనిఖీ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కర్ణాటక నుంచి ఒక్క వరి ధాన్యం బస్తా కూడా అక్రమ రవాణా జరగకుండా గట్టి నిఘా ఉంచాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం తాండూరు మండలం కొత్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర చెక్ పోస్టును ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో కలిసి తనిఖీ చేశారు. చెక్ పోస్టు వద్ద భద్రత చర్యలను పరిశీలించారు. వాహనాల తనిఖీ గురించి ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోకి సరిహద్దు కర్ణాటక రాష్ట్రం నుంచి వరి ధాన్యం అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చెక్ పోస్టు మీదుగా ఒక్క బస్తా కూడా ధాన్యం రవాణా జరగకుండా గట్టి నిఘా ఉంచాలన్నారు. ఎప్పటి కవప్పు ప్రతి వాహనాలను పరిశీలించాలన్నారు. రైతులకు సంబంధించి పత్రాలు పరిశలించాలన్నారు. ఎలాంటి అనుమతులు లేకుంటే వాహనాలను సీజ్ చె యాలన్నారు. ఎవరైనా అక్రమంగా రవాణాకు పాల్పడే, ఎవరైనా సహకరిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు వచ్చే బక్రీద్ సందర్భంగా పశువుల రవాణా జరగకుండా కూడా తనిఖీలు చేపట్టాలన్నారు. రాత్రి వేళల్లో కూడా తనిఖీలు చేపట్టాలన్నారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ వై. నగేష్, కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35548/