schedule Tuesday, September 08, 2026

చేపల కోసం వెళ్లి చెరువులో పడిన వ్యక్తి మృతి

calendar_today May 3, 2025
person dharshininews
చేపల కోసం వెళ్లి చెరువులో పడిన వ్యక్తి మృతి
చేపల కోసం వెళ్లి చెరువులో పడిన వ్యక్తి మృతి - తాండూరు మండలం గుండ్ల మడుగు తాండాలో ఘటన - కేసు నమోదు చేసిన కరణ్ కోట్ పోలీసులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : చేపల వేట కోసం వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు మండలం గుండ్లమడుగు తాండాలో జరిగింది. కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మౌసమ్మ తాండాకు చెందిన రాథోడ్ శాంతుకుమార్ శుక్రవారం రాత్రి గుండ్లమడుగు తాండా సమీపంలో ఉన్న ఐలన్ చెరువులో చేపలు పట్టేందుకు ఇంటి నుంచి వెళ్లాడు. అర్ధరాత్రి దాటినా ఇంటికి రాలేదు. శనివారం ఉదయం జయరాం చవాన్ అనే వ్యక్తి ఐలన్ చెరువులో శాంత్ కుమార్ మృతదేహాన్ని గమనించిన మృతుని భార్య రాథోడ్ లక్ష్మీబాయికి తెలిపాడు. వారు వెళ్లి పరిశీలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు భార్య లక్ష్మీబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35433/